Sunday, December 8, 2024

Big Breaking | భారత టాపర్డర్​ ఢమాల్​.. ఆదుకున్న హార్దిక్​ పాండ్యా

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్​లో ఇవ్వాళ (ఆదివారం) రాత్రి సెకండ్​ మ్యాచ్​ జరుగుతోంది. ఈ మ్యాచ్​లో భారత్​ తొలుత బ్యాటింగ్​ చేసింది. కాగా, సౌతాఫ్రికా బౌలర్ల మెరుపు బంతులకు భారత టాపార్డర్​ కుప్పకూలింది. ఇక.. మిడిలార్డర్​లో వచ్చిన హార్దిక్​ పాండ్యా 39 వ్యక్తిగత పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో 124 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక సౌతాఫ్రికా జట్టు టార్గెట్​ 125 పరుగులుగా ఉంది..

- Advertisement -

ఇక.. ఈ మ్యాచ్​లో సంజు శాంసన్​ (0), అభిషేక్​ శర్మ (4), సూర్యకుమార్​ యాదవ్​ (4), తిలక్​వర్మ (20), అక్షర్​ పటేల్​ (27), రింకూ సింగ్​ (7) పరుగులకే అవుటవ్వగా.. అర్షదీప్​ సింగ్​ 7 తో కలిసి హార్దిక్​ ఇన్సింగ్స్​ని ముగించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 124 పరుగుల మార్క్​ని భారత్​ చేరుకుంది.. కాగా, మార్కో జాన్​సెన్​, కోయిట్జీ, సిమిలేన్​, మార్క్రమ్​, పీటర్​ తలా ఒక వికెట్​ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement