Friday, December 6, 2024

AP | ఐదుగురు ఐఏఎస్‌ ఆఫీసర్ల బదిలీ‌.. రోనాల్డ్‌ రోస్‌కు కీలక పోస్టింగ్‌!

ఆంధ్రప్రభ, విజయవాడ: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారుల‌ను బదిలీ చేయడంతో పాటు మరికొంతమందికి పోస్టింగ్‌లు ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీ కేడర్‌కు వెళ్లిన సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌ రోనాల్డ్‌ రోస్‌కు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీగా కె.కన్నబాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ ఎండీగా అనిల్‌కుమార్‌ రెడ్డిని నియమించింది. కార్మిక శాఖ, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడిని నియమించింది. అలాగే వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరితకు పోస్టింగ్‌ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement