Tuesday, December 10, 2024

Breaking | తిప్పేసిన చ‌క్రి.. పోరాడి గెలిచిన సౌతాఫ్రికా!

సౌతాఫ్రికా, భార‌త్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా మూడు వికెట్ల‌తో విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 124 ప‌రుగులుచేసింది. కాగా, 125 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా జ‌ట్టు టాపార్డ‌ర్‌ని భార‌త బౌల‌ర్లు దెబ్బ‌తీశారు. వ‌రుస వికెట్ల‌తో స్పిన్స‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి పెవిలియ‌న్ పంపాడు.

- Advertisement -

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి అయిదు వికెట్ల‌ను కూల‌గొట్టాడు. అయితే.. వికెట్ల‌కు అడ్డంగా నిల‌బ‌డ్డ సౌతాఫ్రికా బ్యాట‌ర్ స్ట‌బ్స్ 47, అత‌నికి తోడుగా చివ‌ర‌లో జ‌త అయిన కోయిట్జీ 19 రాణించారు. దీంతో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓట‌మిచెందింది. కాగా ఈ సిరీస్‌లో ఇరు జ‌ట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో మూడో మ్యాచ్‌పై అంచ‌నాలు పెరిగాయి. 13వ తేదీన మూడో మ్యాచ్​, 15వ తేదీన నాలుగో మ్యాచ్​ జరగనుంది. ఇక.. ఎవ‌రు గెలిచి సిరీస్ కైవ‌సం చేసుకుంటార‌నే ఉత్కంఠ నెల‌కొంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement