Thursday, November 28, 2024

TG | స్కూల్ గేటు విరిగిప‌డి బాలుడు మృతి !

రంగారెడ్డి: హయత్‌నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల గేటు విరిగి ఒకటో తరగతి విద్యార్థిపై పడింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు.

సోమవారం సాయంత్రం పాఠ‌శాల గేటు విరిగి ప‌డిన ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement