Thursday, December 12, 2024

TG | హైదరాబాద్​లో ప్రేమోన్మాది ఘాతుకం.. లవర్​ తండ్రిపై కాల్పులు

ఆంధ్ర‌ప్ర‌భ, హైద‌రాబాద్‌: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో దారుణం జరిగింది. తన ప్రేయసిని దూరం చేశారని కక్షతో యువతి తండ్రిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతి తండ్రి కంటిలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. అంబర్‌పేటకు చెందిన బల్వీందర్‌ సింగ్‌ (25), సరూర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలోని మ‌రో యువ‌తి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ, వాళ్ల ప్రేమ వ్యవహారం ఇష్టంలేని ఆమె తండ్రి రేవంత్‌ ఆనంద్‌(57) ఆమెను అమెరికా పంపించేవాడు. ఈ విషయం తెలిసి బల్వీందర్‌ సింగ్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

- Advertisement -

ప్రేయసిని తనకు దూరం చేశారని రేవంత్‌ ఆనంద్‌పై బల్వీందర్‌ సింగ్‌ కక్ష పెంచుకున్నాడు. కోపంతో రగిలిపోయిన బల్వీందర్‌ సింగ్‌.. ఆ యువ‌తి ఇంటికి వెళ్లి తండ్రి రేవంత్‌ ఆనంద్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ కాస్త ముదరడంతో తనతో తెచ్చుకున్న ఎయిర్‌గన్‌తో రేవంత్‌ ఆనంద్‌పై కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్‌ రేవంత్‌ ఆనంద్‌ కంటి నుంచి దూసుకెళ్లింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బల్వీందర్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ ఆనంద్‌ను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement