Monday, April 29, 2024

దేవరకొండ పుష్పక విమానం… ఫస్ట్ సింగిల్ రిలీజ్

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. దొరసాని చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఈ యంగ్ హీరో పరిచయమయ్యాడు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన రాజశేఖర్ కూతురు నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్లేదు అనిపించుకుంది.

ప్రస్తుతం పుష్పక విమానం సినిమా చేస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాకు దామోదర దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా పుష్పక విమానం సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ సిలికా’ సాంగ్ ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement