Friday, March 29, 2024

బస్సులు లేక విద్యార్థులు, ఉద్యోగుల అవస్థలు

యాచారం : యాచారం మండలంలో ఆర్టీసి బస్సులు సమయ పాలన పాటించక పోవడం వల్ల విద్యార్థులకు అటు ఉద్యోగస్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఆర్టీసి యజమాన్యం తిరిగి బస్సులను పున: ప్రారంభించింది. కానీ సమయ పాలన పాటించకుండా బస్సు సర్వీస్‌లను కొన్ని రూట్లలో మాత్రమే నడిపిస్తు ఉన్నారు. ఆర్టీసి యజమాన్యం బస్సులను సరిగ్గా నడిపించకుండా సంస్థ నష్టాలలో ఉందని అనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తు ఉన్నారు. ఇప్పటికే లాక్‌డౌన్‌ తర్వాత రెండు సార్లు ఆర్టీసి బస్‌ చార్జీలను పెంచారు. అయిన కానీ సంస్థ నష్టాల్లో ఉందని చెప్పుకోస్తు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో బస్‌ సర్విస్‌లను నడిపించడం లేదు. కావున ఇప్పటికైన ఆర్టీసి అధికారులు స్పందించి విద్యార్థులను ఉద్యోగస్థులను దృష్టిలో పెట్టుకోని అన్ని రూట్లలలో బస్‌ సర్వీస్‌లను ప్రారంభించాలని కోరుతున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం డిపో అధికారులకు పలు మార్లు ప్రజాప్రతినిధులు కలిసి వినతిపత్రాలను సమర్పించారు. అయిన కానీ ఆర్టీసి యజమన్యం బస్సులను మాత్రం ప్రారంభించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement