Monday, December 2, 2024

Shamshabad : హనుమాన్ దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం

శంషాబాద్, నవంబర్ 5 (ప్రభన్యూస్) : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఇవాళ‌ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో హనుమాన్ దేవాలయంలోని నవగ్రహాల విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఉదయాన్నే పూజ కోసం వచ్చిన అయ్యప్ప స్వాములు విగ్రహాలు ద్వంస‌మైన విష‌యాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ దాడికి పాల్పడ్డ నిందితులను పట్టుకుంటామన్నారు. విషయం తెలుసుకున్న శంషాబాద్ ప్రజలు భారీ స్థాయిలో దేవాలయం వద్దకు చేరుకుంటున్నారు. స్థానికులు నిందితులను వెంటనే పట్టుకొని శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు ఇంకెన్ని హిందువుల గుళ్ళపై దాడులు చూడాల్సి వస్తుందోన‌ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధ్వంసం చేసిన వారిపై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement