Tuesday, May 7, 2024

పరిశుభ్రతకు నోచుకోని ప్రభుత్వ కార్యాలయాలు

యాచారం : యాచారం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల బయట చెత్త కాగితాలు, విస్తరాకులతో నిండుకు పోయాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలను వీధిలను పరిశుభ్రంగా ఉంచాలని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలే పరిశుభ్రతకు చోటు ఇవ్వడం లేదు. తమ కార్యాలయాల చుట్టు ఇష్టానుసారంగా ప్లాస్టిక్‌ కవర్లు, కాటన్‌లు తినివేసిన విస్తరాకులు విచ్చలవిడిగా పారావేస్తున్నారు. కావున ఇప్పటికైన సంబందిత శాఖ అధికారులు తమ కార్యాలయాల చుట్టు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను తమ ఇంటి పరిసరా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చేప్పే అధికారులే తమ కార్యాలయల చుట్టు ఉన్న పరిసరా ప్రాంతాలలో మాత్రం పరిశుభ్రంగా ఉంచుకోవడం లేదు. కావున అధికారులు స్పందించి తమ కార్యాలయల చుట్టు ఉన్న పరిసరా ప్రాంతాలను చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement