Monday, May 6, 2024

ఏప్రిల్ నుంచి చిరంజీవి ‘లూసిఫర్’ షూటింగ్..

వచ్చే నెల రెండో వారం నుంచి లూసిఫర్ షూటింగ్ ప్రారంభకానుందట. ప్రస్తుతం  కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.  దీని నిర్మాణం త్వరలోనే పూర్తికానుంది. దీని తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే తదుపరి చిత్రాన్ని ప్రారంభించాలని చిరంజీవి భావిస్తున్నారట. దీని తర్వాత తమిళ యువ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫెర్’ రీమేక్ చిత్రీకరణలో మెగస్టార్ పాల్గొననున్నాడు. స్క్రిప్టు విషయంలో దర్శకుడు మోహన్ రాజా మాతృకకు పలు మార్పులు చేర్పులు చేయగా, చిరంజీవి వాటికి వెంటనే ఓకే చెప్పారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను తాజాగా పూర్తిచేసినట్టు తెలుస్తోంది. దీంతో షూటింగు షెడ్యూల్స్ ను కూడా పక్కాగా వేస్తున్నట్టు చెబుతున్నారు. తొలి షెడ్యూలు షూటింగును వచ్చే నెల రెండో వారం నుంచి నిర్వహిస్తారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement