Saturday, May 4, 2024

సభాపతి పోచారం కు రాంపూర్ తాండ గ్రామస్తులు మద్దతు

బాన్సువాడ సెప్టెంబర్ 03 ప్రభ న్యూస్ – బాన్సువాడ గ్రామీణ మండలం లోని రాంపూర్ తండా గ్రామస్తులు ఈరోజు రాంపూర్ తండా పెద్దలు,ప్రజాప్రతినిధులు,నాయకులు పోచారం స్వగ్రామలో పోచారం శ్రీనివాసరెడ్డి కలిసారు.తమ తాండాను గ్రామ పంచాయతీ గా ఏర్పాటు చేయడంతో పాటుగా తాండా వాసులకు అవసరమైన అన్ని రకాల పనుల కోసం కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ తాండా వాసులు అందరూ కలిసి చేసిన తీర్మానం కాపీని పోచారం కు అందజేశారు..

.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్,వైస్ ఎంపీపీ హరిసింగ్ ప్రకాష్ కారోభారీ,సొసైటీ వైస్ ఛైర్మెన్ అంబర్సింగ్,సర్పంచ్ లలిత శ్రీనివాస్,పార్టీ అధ్యక్షుడు పీర్సింగ్,పకిర,సర్దార్,రాములు,భిక్య,హరి సింగ్,తండా వాసులు అందరూ పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement