Friday, May 17, 2024

టీమిండియాకి గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అయిన కెఎల్ రాహుల్

భారత క్రికెట్ జట్టుకి గుడ్ న్యూస్.. గాయంతో బాధపడుతున్న కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. తన కాలి గాయం కారణంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రెస్ట్ తీసుకుంటుండగా.. ఇవ్వాల జరిగిన ఫిట్‌నెస్ టెస్టులో ఉత్తీర్ణత సాధించి ఎన్‌సిఎ నుండి క్లియరెన్స్ అందుకున్నాడు కెఎల్ రాహుల్.

శ్రీలంకలో భారత్ ఆడనున్న మిగితా మ్యాచ్ ల కోసం శ్రీలంకకు వెళ్లనున్నారు రాహుల్. ఆసియా కప్ 2023కి ఎంపిక చేసిన 17 మంది సభ్యుల జట్టులో కేఎల్‌కు చోటు లభించింది. అయితే, పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు, రాహుల్ KL పూర్తిగా కోలుకోలేని కారణంగా మొదటి రెండు మ్యాచ్‌లు ఆడటం లేదని ద్రవిడ్ స్పష్టం చేశాడు.

ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌లో భారత్ తన మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో తలపడింది. వర్షం కారణంగా మ్యాచ్ ర‌ద్ద‌యింది. కాగా, తమ రెండో మ్యాచ్‌లో భారత జట్టు రేపు (సోమవారం) నేపాల్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ పల్లెకెలె స్టేడియంలో జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement