Saturday, May 4, 2024

Raj Bhavan -13 నెలల త‌ర్వాత రాజ‌భ‌వ‌న్ లో అడుగుపెట్టిన కెసిఆర్ ..

హైద‌రాబాద్ – తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సైతో దూరం దూరంగా ఉంటున్న ముఖ్య‌మంత్రి కెసిఆర్ తాజాగా నేడు ఆమెను క‌లుసుకున్నారు.. 13 నెల‌ల సుదీర్ఘ విరామం అనంత‌రం ఆయ‌న రాజ‌భ‌వ‌న్ లో అడుగుపెట్టారు.. నేడు అక్క‌డ జరిగిన తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణస్వీకార కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య‌మంత్రి హోదాలో హాజ‌ర‌య్యారు.. రాజ‌భ‌వ‌న్ కు వ‌చ్చిన కెసిఆర్ కు గ‌వ‌ర్న‌ర్ సాద‌ర‌పూర్వ‌క స్వాగ‌తం ప‌లికారు.. ఈ సంద‌ర్బంగా కెసిఆర్ గ‌వ‌ర్న‌ర్ కు పుష్ప‌గుచ్చం ఇచ్చి ప‌ల‌క‌రించారు..

కాగా, . రాజ్ భవన్ లో 11 గంటలకు జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇక‌ గతేడాది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సీఎం కేసీఆర్ రాజ్‌ భవన్‌ కు వచ్చి గవర్నర్‌‌ తమిళిసైతో వేదిక పంచుకున్నారు. సంప్రదాయాన్ని అనుసరించి ఇప్పుడు కూడా చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement