Wednesday, May 8, 2024

Raithu Bandhu – రెండో రోజు రైతుల ఖాతాలోకి రూ.1278 కోట్ల నిధులు

హైదరాబాద్ – వానాకాలం పంటకు సంబంధించి రైతుబంధు పంట సాయం పంపిణీ సోమవారం నుంచి కొనసాగుతున్నది.. దీనిలో భాగంగా రెండో రోజైన మంగళవారం నాడు రూ.1,278 కోట్ల నిధులను 16.98లక్షల మంతి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. ఇప్పటి వరకు రెండు రోజుల్లో రెండురోజుల్లో 39,54,138 మంది రైతుల ఖాతాల్లో రూ.1,921 కోట్లు జమయ్యాయి. 38.42లక్షల ఎకరాలకు అంది రైతుబంధు సాయం అందింది. రైతుబంధు ద్వారా తెలంగాణలో సాగు విప్లవం కొనసాగుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పంటలకు సాగునీరు అందించడంతో పాటు వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇస్తుందని, రైతుబంధు సహాయం అందిస్తుందన్నారు. కాగా, వానాకాలం పంటకు సంబంధించి 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయనున్నది. ఈ సారి కొత్తగా 1.5లక్షల మంది పోడు రైతులకు సైతం ప్రభుత్వం రైతుబంధు అమలు చేస్తున్నది. ఈ సారి మొత్తంగా 1.54కోట్ల ఎకరాలకు రూ.7,720.29కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement