Saturday, April 27, 2024

నేడు, రేపు వర్షాలు..

తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ దిశ‌నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తు‌న్నా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి నాగ‌రత్న తెలి‌పారు. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలి‌క‌పాటి వర్షాలు కురు‌స్తా‌యని, ఒకటి రెండు‌చోట్ల ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది

కాగా నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. వనపర్తి జిల్లా వీపనగండ్లలో అత్యధికంగా 1.4 సెంటీమీటర్ల వర్షం కురవగా, నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్‌లో సెంటీమీటరు వర్షపాతం కురిసింది.వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. సాధారణం కంటే 3 డిగ్రీలు అదనంగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా తిమ్మారావుపేటలో 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు భారత వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: భారీ లాభాలను ఆర్జించిన SBI..

Advertisement

తాజా వార్తలు

Advertisement