Sunday, May 5, 2024

కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ ను గెలిపించండి: భూపతి రెడ్డి ప్రచారం

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ కోసం కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆద్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గం, వీణవంక మండలంలోని మల్లన్నపల్లి గ్రామంలో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూర్ వెంకట్ గెలుపు కోసం ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్దిస్తున్నారు. ఈ సందర్బంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ ను గెలిపోయించాలని అభ్యర్దిస్తున్నారు. గడిచిన 7 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంది తప్ప పేద ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. మరోసారి టిఆర్ఎస్ కు ఓటేస్తే ఊళ్లకు ఊళ్ళు అమ్మేస్తారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో వెంకట్ ను గెలిపించి కాంగ్రెస్ ను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ  కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి టీం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement