Saturday, May 4, 2024

PM Modi: ఈనెల 7న తెలంగాణకు ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచార నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్నారు. ఈనెల 7, 11 తేదీల్లో భాజపా నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు.

ఈ తేదీల్లో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నల్గొండ జిల్లాల్లో సభలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక చేస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన తరువాత రాష్ట్రానికి ప్రధాని రానుండటం ఇదే తొలిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement