Saturday, April 27, 2024

TS: నాలుగు రోజులు ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకోండి… ఆర్టీసీ రిక్వెస్ట్…

హైదరాబాద్ నగరంలో బస్సు ప్రయాణికులు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సిటీ బస్సుల్లో తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలసి ఆర్టీసీ అధికారులు సూచించారు. మేడారం జాతర సందర్భంగా అక్కడికి బస్సులు వెళ్లే కొద్దీ నగరంలో బస్సుల సంఖ్య తగ్గుతుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో తిరిగే 2,850 సిటీ బస్సుల్లో దాదాపు 2 వేల మేడారం జాతరకు వెళ్లనున్నాయి.

జాతరకు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే కొన్ని బస్సులను కేటాయించారు. ఈ నెల 21 నుంచి మేడారానికి పూర్తి స్థాయిలో బస్సులు వెళ్లనున్నాయి. ఇందులో 250 బస్సులు నగరం నుంచి బయలుదేరుతాయి. మిగిలిన బస్సులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లనున్నాయి. ఈ సందర్బంగా పనులు పెట్టుకుని ఆటోలు, క్యాబ్‌లు అవకాశంగా భావించి దోపిడీకి పాల్పడతారనే ఉద్దేశంతో హెచ్చరిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. నగరంలో 2 వేల వరకు బస్సులను జాతరకు కేటాయించారు. ఆ బస్సులు పోనూ.. నగరవాసులకు 850 బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ నాలుగు రోజులు బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారు, తమ పనులు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement