Sunday, May 5, 2024

గంజాయి పై పోలీసుల కొరడా

గంజాయి సరఫరాదారుల పై సుల్తానాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించాలని రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కొన్ని రోజులుగా గంజాయి విక్రయ ప్రదేశాలను గుర్తించడం తో పాటు అనుమానితుల కదలికలపై పోలీసులు డేగ కన్ను వేశారు. ఇందులో భాగంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

శుక్రవారం ఎసిపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలోని సుల్తానాబాద్ క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం ఎస్ఐ ఉపేందర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానంగా సంచరిస్తున్న సుద్దాల కు చెందిన న్యాతరి వంశీని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా 300 గ్రాముల గంజాయి లభించిందన్నారు. విచారణలో వంశీ ఇచ్చిన సమాచారం మేరకు సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీకి చెందిన వేముల చంద్రప్రకాష్ ను అదుపులోకి తీసుకొని అతని వద్దనుండి కిలో 100 గ్రాములు, శాస్త్రి నగర్ కు చెందిన కల్వల రోహిత్ నుండి 900 గ్రాములు, ఆదిలాబాద్కు చెందిన దుర్గం సంజీవ్ నుండి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి పూర్తిస్థాయి నియంత్రణకు చర్యలు చేపట్టామని ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదన్నారు. గంజాయి సాగు చేసిన, సరఫరా చేసిన, విక్రయించిన, వినియోగించిన చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.

యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, పిల్లల కదలికల పై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రజలు గంజాయి సరఫరా చేసినా, విక్రయించిన పోలీసులకు సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. పక్కా సమాచారం అందించిన వారికి నగదు పారితోషికం అందిస్తామన్నారు. విక్రయాన్ని అడ్డుకొని చాకచక్యంగా గంజాయి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న ఎస్ఐ ఉపేందర్, ఏఎస్ఐ తిరుపతి సిబ్బంది విష్ణువర్ధన్రెడ్డి, సదానందం, శాంతయ్య, అశోక్, తిరుపతి లను ఏసిపి అభినందించారు తోపాటు సిబ్బందిని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి అభినందించారు. మీడియా సమావేశంలో సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు ఉపేందర్, జోస్నాతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement