Monday, May 6, 2024

నిజాం సాగర్ ప్రాజెక్ట్ ను ప‌రిశీలించిన‌ పోచారం

నిజాంసాగర్ జులై 29 ప్రభ న్యూస్ – నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శనకు తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. శనివారం ప్రాజెక్ట్ సందర్శన లో భాగంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాజెక్ట్ పై తిరుగుతూ ప్రాజెక్ట్ ను వీక్షించారు. ఈ సందర్బంగా ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడుతూ ప్రాజెక్ట్ నీటి మట్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, మంచి వర్షాలతో జూలై మాసం లో ప్రాజెక్ట్ పూర్తిగా నిండుకుండడంతో ఇక రైతుల పంటలకు డోకా లేదంటూ రైతులకు శుభాకాంక్షలను తెలిపారు.

రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రం లో కరువు లేదని సమృద్ది వర్షాలతో రాష్ట్రం సశ్యసమలంగా ఉందని అన్నారు.ఈ ఏడాది సైతం ప్రతి ఏడాది మాదిరిగానే జూలై మాసం లోనే ప్రాజెక్ట్ పూర్తిగా నిండుకుందని ఇక రెండు పంటలకు డోకా లేదని అన్నారు.ఏప్రిల్ మే నెలలో వచ్చే వడ గండ్ల వాన భారిన పడకుండా రైతులు ముందుగానే పంటలు వేసుకోవాలని సూచించారు.ఏప్రిల్ నెల ప్రారంభంలోనే రెండవ పంట హార్వెస్టింగ్ చేసుకునేలా ప్రణాళికలు వేసుకోవాలని అన్నారు.ఒక వేళ వర్షాలు లేక ప్రాజెక్ట్ నిండక పోయిన కొండ పోచమ్మ సాగర్, కాళేశ్వరం నుండి నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకుంటామని సీఎం కెసిఆర్ తనకు ముందే హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement