Saturday, May 4, 2024

నందిగామ గ్రామంలో కార్డెన్ సెర్చ్… ప‌లువాహ‌నాలు సీజ్..

నిజాంపేట, జులై 29(ప్రభన్యూస్) – మెదక్ జిల్లా నిజాంపేట,మండలపరిధిలోని నందిగామ గ్రామంలో శనివారం తెల్లవారుజామున రామాయంపేట సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ లక్ష్మీ బాబు, ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇద్దరుఎస్సైలు పోలీస్ సిబ్బందికలిసి గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి ఇంట్లో ఉన్న వాహనాల ధ్రువ పత్రాలను పరిశీలించారు. సరైన ధ్రువ పత్రాలు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సుమారు 15 నుండి 19వాహనాలను పట్టుకున్నారు. అలాగే పాత నేరస్థుల వివరాలను సేకరించారు.

ఈ సందర్భంగా సిఐ లక్ష్మీ బాబు,మాట్లాడుతూ నందిగామ గ్రామంలో కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించామని, ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ప్రజలతో పోలీసులు మమేకమై ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడమే అన్నారు. అదేవిధంగా గ్రామంలో
గ్రామస్థులకు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు సరైన పేపర్లు ఉన్నవాటిని కొనుగోలు చేయాలని, అసాంఘిక కార్యకలాపాలు తావునివ్వకుండా ఉండాలని గ్రామస్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలోఎస్ఐ లుశ్రీనివాస్ రెడ్డి,రంజిత్,పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులుపాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement