Monday, May 6, 2024

Peddapalli – మాది 4 కోట్ల కుటుంబ పార్టీ.. మోడీకి కేటీఆర్ కౌంటర్

పెద్దపల్లి -‘ గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బొంద పెట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ 11 సార్లు 55 ఏళ్ల పాటు అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఐదు దశాబ్దాల పాటు పనిచేసిన కాంగ్రెస్ కు రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు, కళ్యాణ లక్ష్మి లాంటి ఒక్క పథకం అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ప్రధాని తన దోస్తుకు అదాని కి 14.50 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేశారన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే మించిన వారు లేరన్నారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చాలా మంచోడని రాబోయే ఎన్నికల్లో 60 వేల మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తమ పార్టీ అధికారంలోకి రాదని నేను గెలిచాక బిఆర్ఎస్లోకి వస్తానని అసత్యపు ప్రచారాలు చేసుకుంటున్నాడని, తమకు పెద్దపల్లి నియోజకవర్గ ప్రతినిధి మనోహర్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. ఓడిపోయే పార్టీకి ఓటు వేసే అంత పిచ్చివాళ్లు పెద్దపల్లి ప్రజలు కాదని, మూడోసారి కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు

ఇక ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలు మాదిరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని ,. ఆ కంపెనీలో డైరెక్టర్‌, మేనేజర్‌, సెక్రటరీ అన్ని పదవులు ఆ కుటుంబ సభ్యులవేనని అంటూ పాలమూరు సభలో మోడీ చేసిన విమర్శలపై కేటీఆర్ స్పందిస్తూ, అవును మాది నాలుగు కోట్ల కుటుంబ పార్టీ అంటూ కౌంటర్ ఇచ్చారు.

. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, శాసన మండలి చీఫ్ భాను ప్రసాద్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ రమణ తో పాటు వేలాది సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement