Tuesday, April 30, 2024

కారు ఓవ‌ర్ స్పీడింగ్.. ఫుట్ పాత్ పై దంప‌తుల‌ను ఢీ కొన్న క‌న్నడ హీరో

కన్నడ సినీ నటుడు నాగభూషణ చిక్కుల్లో పడ్డారు. నటుడు నాగభూషణ శనివారం రాత్రి షూటింగ్ ముగించుకుని తన కారులో ఉత్తరహళ్లి నుంచి కోననకుంట వైపు వెళ్తున్నారు. అదే స‌మ‌యంలో వసంత పుర ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న కృష్ణ(58), ప్రేమ(48) అనే దంపతులను నాగభూషణ కారు ఢీకొట్టింది. ఆ తర్వాత పక్కనే ఉన్న కరెంట్ పోల్ కు ఢీకొని ఆగింది. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.

వెంటనే నాగభూషణ కారులో నుంచి దిగి పరిస్థితిని గమనించిన నాగ‌భూష‌ణ‌.. స్వయంగా తనే వారిద్దరిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్ కు తీసుకెళ్లే లోపే భార్య (ప్రేమ) మరణించింది. భర్త(కృష్ణ)కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదానికి కారణం అయిన నాగభూషణపై బెంగళూరులోని కుమారస్వామి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. పోలీసులు నటుడి కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కృష్ణ వైద్యాన్ని బంధించి ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే, నటుడు నాగభూషణ వైపు నుంచి ఇప్పటి వరకు ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement