Thursday, May 16, 2024

అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయించండి – సీఎల్పీ లీడర్ భట్టికి విన‌తి

ఎల్బీనగర్ ఆగస్టు 5 (ప్రభ న్యూస్). ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని ,ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలని కోరుతూ, తెలంగాణ వెల్నెస్ సెంటర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ శాంతి కుమార్ నాడు శనివారం తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆరోగ్యశ్రీ మరియు ఈ హెచ్ ఎస్ హెల్త్ కేర్ ట్రస్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ వెంటనే పర్మినెంట్ చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న డాక్టర్స్ ను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

అంతే కాకుండా జీవో నెంబర్ 59 మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్స్ రిక్రూట్మెంట్ లో డెంటల్ డాక్టర్స్ రిక్రూట్మెంట్ కూడా ఇంక్లూడ్ చేయాలని అసెంబ్లీలో ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావించి న్యాయం చేకూర్చాలని విన్నవించారు. సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వెల్నెస్ సెంటర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ సమీర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రిజ్వాన్ మొహమ్మద్ తెలంగాణ కాంగ్రెస్ డాక్టర్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ గొట్టిముక్కల విశ్వతేజేశ్వరరావు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement