Saturday, May 4, 2024

Australian Open | ఫైనల్స్ కి చేరుకున్న ప్రణయ్..

సిడ్నీలో జ‌రుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఇవ్వాల (శనివారం) జరిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్ లో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్, తన తోటి భార‌తీయుడైన ప్రియాంషు రజావత్‌పై వ‌రుస సెట్ల‌లో విజ‌యాన్ని విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు.

ఇవ్వాల జ‌రిగిన‌ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో.. వ‌రుస సెట్ల‌లో గెలిచిన ప్ర‌ణ‌య్ 21-18 21-12 పాయింట్ల తేడాతో రజావత్‌పై త‌న విజ‌యాన్ని నమోదుచేసుకున్నాడు. ఇక రేపు (ఆదివారం) జర‌గ‌నున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 ఫైన‌ల్ పోరులో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్‌తో తలపడనున్నాడు ప్ర‌ణ‌య్.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement