Monday, April 29, 2024

Exclusive | పాత గాయాలు, బోగస్​ సర్టిఫికెట్లు.. విద్యార్థులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా?: సీపీ రంగ‌నాథ్‌

వరంగల్ (ప్రభ న్యూస్​): కేయూ ఇన్సిడెంట్​పై, ఏబీవీపీ విద్యార్థుల ఆరోపణలపై వరంగల్​ సీపీ రంగనాథ్​ స్పందించారు. వారి ఆరోపణల్లో వాస్తవం లేదని, కొంతమంది స్టూడెంట్స్​ వీసీ చాంబర్​ డోర్​ పగలగొట్టి, కంప్యూటర్లు ధ్వంసం చేశారని.. వీళ్లే గతంలో బైరి నరేశ్​పై దాడి చేశారని అన్నారు. పాత గాయాలు చూపి బోగస్​ సర్టిఫికెట్లతో కోర్టును తప్పుదోవ పట్టించారని సీపీ చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో ఇవ్వాల (గురువారం) మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

‘‘కేయూ వీసీ కళ్లలో ఆనందం చూసేందుకు నేను గన్ పెట్టి బెదిరించానని కేయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నేనే దగ్గరుండి కొట్టానని చెబుతున్నారు. నాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. కొంతమంది ఏబీవీపీ విద్యార్థులు వీసీ చాంబర్ డోర్ పగలగొట్టి, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఈ విద్యార్థులే పిబ్రవరి 28న బైరి నరేష్ పై దాడి చేశారు. వైద్య పరీక్షల బోగస్ సర్టిఫికెట్లు పెట్టారని ఆరోపించారు. తమను పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారు. పాత గాయాలు చూపి జడ్జిని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఆరోపణలు మాకు కొత్తకాదు. కేయూలో చాలా సంఘాలు ఉన్నా.. కొందరే ఇలా చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఊరుకోబోమని ముందే హెచ్చరించాం.. అయినా విద్యార్థులు పట్టించుకోలేదు. కేయూలో తప్పులు జరిగితే చట్టం, కోర్టుల పోరాడవచ్చు కానీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా?” అని సీపీ రంగనాథ్​ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement