Wednesday, May 15, 2024

మహాప్రబోధం…శ్రీకృష్ణుని జీవితం!

దుష్టుల వల్ల ధర్మం అడుగంటినపుడు, శిష్టులు బాధలు అనుభవించినపు డు…దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి ధర్మాన్ని ఉద్ధరించడానికి తాను అన్ని యుగాల్లో భూమిపై అవతరిస్తానని కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో శ్రీ కృష్ణుడు అర్జునునకు భగవద్గీత ఉపదేశం చేశాడు. ఈమేరకు శ్రీ మహావిష్ణువు భూ లోకంలో రాక్షసుల హంసలూ, అరాచకాలతో నిత్యం తల్లడిల్లుతున్న శిష్టుల సంరక్ష ణార్థం 22 అవతారాలను దాల్చినట్లు శ్రీమద్భాగవతం చెబుతోంది. వీటిలో ముఖ్య మైనవి దశావతారాలు. వీటిలో శ్రీకృష్ణావతారం 8వదిగా భాగవతం చెబుతోంది.
5050 ఏళ్ళ క్రితం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరించాడు. శ్రీ మహావిష్ణు వు అవతారాల్లో శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాల ఉత్తమమైనవని అంటారు. అయితే శ్రీరా ముని తర్వాత ప్రపంచంలోని హందువులందరికి ప్రియమయినవాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్మ శ్రీముఖనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ బహుళ అష్టమి, రోహణీ నక్షత్రం, నాలుగో పాదం, బుధవారం అర్థరా త్రి యదువంశంలో… కారాగారం లో బంధించబడిన దేవకీ, వసు దేవులకు పుత్రునిగా జన్మించాడు. శ్రీకృష్ణుడు జన్మించగానే శంఖు, చక్ర, గదాధారిగా దేవకీ, వసుదేవు లకు తన నిజరూపంతో దర్శనమి చ్చాడు. తన అవతార రహస్యాన్ని వివరించాడు. కృష్ణ అనే శబ్దానికి కష్టాలు తీర్చేవాడు. కలిమినిచ్చే వాడు. విశ్వాసాన్ని తన రూప గుణా తిశయంతో ఆకట్టుకునేవాడు అనే వివిధ అర్థాలున్నాయి. పుట్టుక నుం చి నిర్యా ణం వర కు ఆయన జీవిత కాలమంతా ఒక మహాప్రబోధం. సకల మానవాళి రాతమార్చి… వారి జీవితాలకు చు క్కానిగా నిలిచే భగవద్గీత ఉపదేశం, కంసుని మొదలుకొని కురు రాజు దుర్యోధనాదు లను వధింపజేయడంవరకు దుష్టశిక్షణ సాగించి కృష్ణుడు ధర్మాన్ని ఉద్ధరించాడు.

శ్రీకృష్ణ భగవానునికి 8తో గల అనుబంధం

శ్రీకృష్ణ పరమాత్మకు 8తో ఎంతో అనుబంధం ఉంది. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జననం. అష్టమి 8వ తిథి. ఓం నమో నారాయణ 8 అక్షరాలు గల మంత్రం. దశావతారాలలో శ్రీకృష్ణావతారం 8వది. దేవకీ వసుదేవులకు 8వ సంతా నం, ఆయన జన్మస్థానమైన చెఱసాలకు 8 ద్వారాలు. శ్రీకృష్ణుని ధర్మపత్నులు 8మంది.

లీలామానుష రూపుడి విశిష్టత

శ్రీకృష్ణుడు నీలామానుష రూపుడు, మానవుడిగా, దైవంగా మార్చిమార్చి తన అవతార వైభవాన్ని ప్రదర్శించాడు. శాంత, దాస్య, వాత్సల్య, సఖ్య, మధుర భావాల ను… భక్తులు భగవంతుడిని చేరుకునే సులభ మార్గాలుగా శ్రీకృష్ణ పరమాత్మ చూపా డు. కాగా వాటిని స్వయంగా శ్రీకృష్ణుడి జీవితంలో కూడా మనం చూడవచ్చు.
ఎంత ఉద్రిక్త పరిస్థితుల్లోనైనా నందనందనుడు శాంతంగా వ్యవహరించాడు. శిశుపాలుడు నిండు సభలో అవమానపరచినా ఉద్రేకపడలేదు. శిశుపాలుని తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తప్పుల్ని భరించి… అనంతరం శిశుపాలున్ని శిక్షించాడు.
పెద్దల వద్ద వినయవిధేయతలతో ఉండడమే దాస్యభావం, దేవాది దేవుడైనా అగ్రజుల వద్ద అణుకువగా మెలిగాడు. గురువు సాందీపుని వద్ద బంటులా పని చేశాడు. రేపల్లెలో గోవుల కాపరిగా ఆ మూగ జీవాలను ప్రేమించాడు. సేవించాడు.
చిన్నవాళ్ళతో ప్రేమగా, ఆదరంగా ఉండడం వాత్సల్యం, ధీర గంభీరుడయిన దేవకీ పుత్రుడు వాత్సల్యానికి మారు పేరు. తనను ఆశ్రయించిన వారిని ఆదుకోవడం లో ఆయనను మించిన కరుణామూర్తి మరొకడు లేడు. ద్రౌపది ”అన్నా! నీవే నాకు దిక్కు!” అన్నందుకు నిండు సభలో ఆమె గౌరవాన్ని (మానాన్ని) సంరక్షించాడు. సుయోధనుడు రాయబార సమయంలో రాజభోగాలనూ, పంచభక్ష పరమాన్నాల నూ సిద్ధం చేసినా… పేదవాడు, భక్తుడు విదురిని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి ఆయన పెట్టిన సాధారణ భోజనం (పప్పన్నాన్ని) సంబరంగా ఆరగించాడు.
చిన్ననాటి స్నేహతుడు కుచేలుడు నిరుపేదైనా, సతీసమేతంగా అతని పాదాలు కడిగి ఆ జలాన్ని తన తలపై చల్లుకున్నాడు శ్రీకృష్ణుడు. కుచేలుడు తెచ్చిన అటుకులనే మధుర పదార్థాలుగా స్వీకరించారు. ప్రతిగా సకల సంపదలిచ్చి కుచేలున్ని ఐశ్వర్య వంతుణ్ణి చేశారు. తనను ఆరాధించే వాళ్ళతో అంతే ఆరాధనతో ఏకమైపోతాడు. గోపిక లను మధురభావంతో ముంచెత్తి వాళ్ళను అనేక లీలల్లో ఓలలాడించాడు. వారికి అలౌకికమైన ఆనందాన్ని అందిస్తూనే అంతిమంగా వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. కుటుంబ బంధాలకు గౌరవమిచ్చాడు. తన తండ్రి వాసుదేవునకు స్వయానా చెల్లెలు, తద్వారా తనకు మేనత్త అయిన కుంతీ దేవి 3వ కుమారుడు అర్జునునికి తన తోడబుట్టిన చెల్లెలు సుభద్రాదేవి నిచ్చి పెళ్ళి చేసి మేనరికపు వివాహాలతో కుటుంబ బంధాలను గౌరవించాడు. అలాగే అన్న బలరాముని కూతురు శశి రేఖను … చె ల్లెలు. సుభద్ర కొడుకు అభిమన్యు నికి ఇచ్చి వివాహం చేశాడు.
మానవ జీవితానికి చుక్కానిగా భగవద్గీత ఉపదేశం చేశాడు. మహా భారత సైన్యం కురుక్షేత్ర యుద్ధ రంగం లో మోహరించి కయ్యానికి కాలుదు వ్వుతున్న ఉత్కం ఠ స్థితికి… నిర్వేదానికి గురై… ధర్మ సంకటంలో పడిన మహా వీర యోధుడు, పాండవ మధ్యము డు, అర్జునుణ్ణి యుద్ధ కార్యోన్ముఖుని చేసేందుకు… తన విశ్వరూప ప్రదర్శ నతో ప్రవచించిన భగవద్గీత ఉపదేశం ఈ లోకానికి అంతటికి వర్తించే చుక్కాని అయింది. సమస్త వేదసారాన్నీ, భగవతత్వాన్నీ సమగ్రంగా అందిస్తుంది. పఠించి నవారు శ్రీకృష్ణ పర మాత్మ కృపకు పాత్రులై తలపెట్టిన కార్యాల్లో విజయం సాధిస్తారు.
ఆయుధాన్ని పట్టనని ప్రకటించిన శ్రీకృష్ణుడు భీముడు, అర్జునులను ఆయుధా లుగా మలుచుకొని కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని అత్యంత చాకచక్యంగా నడిపి ధర్మా నికి (పాండవులకు) విజయాన్ని చేకూర్చాడు. యుద్ధంలో తమకు (పాండవులకు) సం పూర్ణంగా విజయాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మను.. కృతజ్ఞతతో వైభవోపేతంగా ధర్మరాజు తన సోదరులు, పరివారంతో కలిసి ఘనంగా సన్మానించారు. మహాభార తంలో యుగ పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు న్యాయం, నీతి, ధర్మం (పాండవుల) పక్షాన నిలబడి దుష్ట (కౌరవుల) సంహారం గావించాడు.

- Advertisement -

శ్రీకృష్ణుని అవతార పరి సమాప్తి

శ్రీకృష్ణ భగవానుడు క్రీ.పూ. 3,103 సంవత్సరం ప్రమాది నామ సంవత్సరం, చైత్ర శుద్ధ పాడ్యమి, శుక్రవారం అశ్వని నక్షత్ర యుక్తం… శ్రీకృష్ణుని అవతారం పరి సమాప్తి జరిగింది. శ్రీకృష్ణుడు, బలరాముడు నిర్యాణం అయిన అనంతరం కొద్దిసేప టికే సముద్రంనుంచి ప్రళయాంతకమైన ఉప్పెన… ద్వారక వైపు ముంచుకొచ్చింది. ప్రభాస తీరంలో బలరాముని దేహం పూర్తిగా కాలిపోయినా, శ్రీకృష్ణుని పార్థివ దేహా నికి నిప్పు అంటలేదు. సముద్ర అలలు శ్రీకృష్ణుని పవిత్ర దైవదేహాన్ని సముద్రంలోకి భక్తి, వినమ్రతతో సగౌరవంగా తోడ్కొని వెళ్లాయి. దేవదేవున్ని తనలో విలీనం చేసుకు న్నందుకు మహాసముద్రం ఆనందంతో ఉప్పొంగింది. దీంతో శ్రీమహావిష్ణువు… మరో అవతార ప్రకటనకు అది నాంది ప్రస్తావనగా ఈ సంఘటన నిలిచిపోయింది.
అనాదిగా శ్రావణ బహుళ అష్టమి రోజున కోట్లాది భక్తులు శ్రీ కృష్ణ భగవానుని ఆరాధిస్తూ భక్తి పారవశ్యంలో మునిగి శ్రీకృష్ణ భగవానుడిని తమ తనువల్లా నింపుకొని ఆయన మహోజ్వల దివ్యమంగళ తేజోవిశ్వరూపాన్ని గాంచి శ్రీకృష్ణ భగవానుని కృపకు పాత్రులు అవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement