Sunday, October 13, 2024

TS: సీపీఐకి భారీ షాక్… వనమా సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్న కీలక నేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఐకి భారీ షాక్ తగిలింది. 40 సంవత్సరాలుగా సీపీఐ పార్టీలో చరిత్ర కలిగిన నేత, విద్యార్థి ఉద్యమం నుండే యువజన సంఘం, పార్టీ, కార్మిక రంగంలో ప్రావీన్యం కలిగిన నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

రాష్ట్ర సీపీఐ కమిటీ సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ తన 2వేల మంది అనుచరులతో వనమా వెంకటేశ్వరరావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో త్వరలో చేరనున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉభయ ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క బీసీ కాండిడేట్ వనమా అన్నారు. వనమా అందరివాడన్నారు. బీసీని ఓడించాలని కుట్రలను తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement