Wednesday, May 15, 2024

NZB: బిగాలకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు.. బోనమెత్తిన మహిళలు..

నిజామాబాద్ సిటీ, నవంబర్ 17 (ప్రభ న్యూస్): నిజామాబాద్ అర్బన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ బిగాలకు… మీ వెంటే మేముంటా మంటూ.. పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. ఇవాళ నిజామాబాద్ నగరంలోని 16, 17 డివిజన్లలోని గౌతమ్ నగర్, దుబ్బా లో బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో జరిగిన నిజామాబాద్ అభివృద్ధిపై కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్తించారు. నిజామాబాద్ నగరం శాంతి యుతంగా ఉంటూ మరింత అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బి.ఆర్.ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.

స్థానిక యువత కోసం ఐటి హాబ్ నిర్మాణం చేసి ఉద్యోగాలు కల్పించామని, బి.ఆర్.ఎస్ పార్టీకి ఓటు వేస్తే నిరంతరం జాబ్ మేళాలు నిర్వహించి యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
అభివృద్ధికి సజీవ సాక్షాలు అయిన ఐటి టవర్, వైకుంఠ దామం, నూతన సమీకృత కార్యాలయాలు మీ ముందే ఉన్నాయన్నారు. మరోసారి దీవించండి.. మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ మాయవార్ సవిత రాజు, కో అప్షన్ మెంబర్ చంద్రకళ, మాజీ కార్పొరేటర్ మాయ వార్ సాయిరాం, నాయకులు మాయవార్ సంతోష్, మాయవార్ శివ, 16వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పంచారెడ్డి సురేష్, పంచారెడ్డి అనిత, పంచారెడ్డి లక్ష్మణ్, మధుకర్ రెడ్డి, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement