Wednesday, December 6, 2023

Congress Manifesto – 62 హామీలు 42 పేజీలు..కాంగ్రెస్ ఎన్నిక‌ల మేనిపెస్టో అభయహస్తం విడుద‌ల

హైదరాబాద్ – తెలంగాణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది.. ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే నేడు మేనిఫెస్టోను విడుదల చేశారు.. ఇప్ప‌టికే ఆరు వాగ్ధానాల‌తో మిని ఫెస్టోను విడుద‌ల చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు మ‌రికొన్ని హామీలను చేరుస్తూ ఎన్నిక‌ల వాగ్ధాన ప‌త్రాన్ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఆరు హామీల పేరుతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ హైదరాబాద్ గాంధీ భ‌వ‌న్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ శ్రీధర్‌ బాబు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

- Advertisement -
   

ఆరు గ్యారంటీలతో పాటు మరో 62 హామీలను ‘అభయహస్తం’ పేరుతో కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతులకు ఒకేసారి రూ.2 లక్షల పంట రుణ మాఫీ, రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా, సాగుకు 24 గంటల విద్యుత్తు సరఫరా వంటి వ్యవసాయ రంగానికి మేలు చేసే హామీలు మేనిఫెస్టోలో ఉన్నాయి. ఉద్యోగులు గట్టిగా డిమాండ్‌ చేస్తున్న.. సీపీఎ్‌సను రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎ్‌సను తీసుకొస్తామని కాంగ్రెస్‌ భరోసా ఇచ్చింది.. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుద్యోగులకు భరోసా కల్పించేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ను రూపొందించింది.

ఇందులో ముఖ్యంగా ప్రస్తావించాల్సింది.. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్. ఎప్పుడెప్పుడు.. ఏయే తేదీల్లో నోటిఫికేషన్లు ప్రకటించేది వివరించింది కాంగ్రెస్ మేనిఫెస్టో. 2024, ఫిబ్రవరి ఒకటో తేదీన గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించగా.. ఏప్రిల్ ఒకటిన గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తేదీలతో సహా వెల్లడించింది మేనిఫెస్టో. జూన్ ఒకటో తేదీన గ్రూప్ 3, అదే తేదీన గ్రూప్ 4 నియామకాలకు నోటిఫికేషన్ రానుంది. ఫేస్ వన్, ఫేస్ 2 కింద.. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు ఉంటాయని మేనిఫెస్టోలో స్పష్టంగా వెల్లడించటం విశేషం.

కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అంశాలు ఇవే..!

సిటిజన్ చార్ట్ కి చట్టబద్దత
ధరణీ స్థానంలో భూ భారతి పోర్టల్
పసుపు కుంకుమ పథకం కింద ఒక లక్షతో పాటు తులం బంగారం
తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సన్న బియ్యం పంపిణీ
అమ్మ హస్తం పథకం పేరుతో 9 నిత్యావసర సరుకుల పంపిణీ
ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు
రేషన్ డీలర్లకు గౌరవ వేతనం
వార్డు సభ్యులు గౌరవ వేతనం
ఎంబీసీ లకు ప్రత్యేక కార్పొరేషన్
ట్రాన్స్ జెండర్లకు ఆటోలు ,ప్రత్యేక సంక్షేమ పథకాలు
జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం

Advertisement

తాజా వార్తలు

Advertisement