Tuesday, April 30, 2024

MP: రాబోయేది మోడీ ప్రభుత్వమే.. ధర్మపురి అరవింద్​

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 26(ప్రభ న్యూస్):
రాష్ట్రంలో జీరో బడ్జెట్ రాజకీయాలను ముందుకు తీసుకువెళ్లినప్పుడే ప్రజాస్వామ్యం వెల్లి విరుస్తుందని, ఇది తాను కోరుట్ల నియోజ కవర్గంలో పోటీ చేసినప్పుడు రుజువైందని.. ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ లో బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేషంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు.

గత అసెంబ్లీ ఎన్నికల ను పోలిస్తే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి 3 లక్షల 70 వేల ఓట్లను సాధించిందనీ అంటే బిజెపికి సుమారు 30% ఓటింగ్ వచ్చిం దని గుర్తు చేశారు. బోధన్ నుంచి జగిత్యాల వరకు కష్టపడ్డ బిజెపి కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేక ధన్యవా దాలు తెలిపారు ఈ విజయం కార్యకర్తలేదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ కు దీటుగా ఓట్ల శాతం వచ్చిందని వెల్లడిం చారు. కేంద్ర నాయకత్వం సైతం సంతోషం వ్యక్తం చేసిందని తెలిపారు. జిల్లాలోని అర్బన్ లో ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ నియోజకవర్గంలో పైడి రాకేష్ రెడ్డి గెలిచినందుకు ఎమ్మెల్యేలను అభినందిం చారు. కోరుట్ల నియోజ కవర్గంలో పార్టీ బల హీనంగా ఉండడంతో.. నిజామాబాద్ నియోజకవర్గాన్ని వదిలి కోరుట్ల నియోజకవర్గాన్ని కి వెళ్లాల్సి వచ్చిందన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో ఇతర పార్టీలు కోట్ల రూపాయలు గుమ్మరిస్తే తాను.. జీరో బడ్జెట్ కు ఎన్నికలకు నాంది పలి కా నని తెలిపారు.

ప్రధాని మోదీ, బిజెపి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో డబ్బులను పంచలేదని పేర్కొ న్నారు. అయినా కూడా కోరు ట్ల నియోజకవర్గంలో 60 వేల మెజార్టీ రావడం జరిగిం దన్నారు. జీరో బడ్జెట్ తో కోరుట్ల నియోజకవర్గంలో 60 వేల మెజార్టీ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఐదు సంవత్సరాల రాజకియ జీవితంలో ఒక్క అవినీతి ఆరోపణ తనపై లేదన్నారు. గతంలో తనకు 7 నియోజ కవర్గాల బాధ్యత ఉన్నప్పుడు భారం ఉండేదని ప్రస్తుతం ఎమ్మెల్యేల గెలుపుతో 30 శాతం భారం తగ్గిందన్నారు. ఎన్ని కల్లో వచ్చిన విజయం కార్యకర్తలేదని నొక్కి చెప్పారు.

దేశవ్యాప్తంగా మోడీ పవనాలు విస్తున్నాయని, అందుకు నిదర్శనం ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీ స్గడ్లలో బిజెపి విజయ డంకా మోగించడమేనని తెలిపారు. ఉత్తరాదిన ఎన్నికలు జరిగితే.. బలం రూ 30 లక్షల నుండి రూ 40 లక్షల వరకు ఎన్నికలు ముగిస్తాయి.. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా కాదు…. తెలంగాణలో ఎలక్షన్ లో విజయం సాధించాలంటే అభ్యర్థులు కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందన్నారు. కోరుట్లలో తాను చేసిన జీరో బడ్జెట్ రాజకీయాలు సత్ఫలితాలు ఇచ్చాయని అన్నారు. రాష్ట్రం లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

- Advertisement -

ఈ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని వెంటనే నిల బెట్టుకోవాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలను లేవనెత్తు తామని అన్నారు. నిజామా బా ద్ జిల్లాలో పసుపు బోర్డు తీసు కురావాలని రైతుల కలను మో డీ సర్కార్ నెరవేర్చనుంద న్నారు. నిజామాబాద్ పర్యటనకు రానున్న నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో నిజామాబాద్ జిల్లా పరిస్థితు లను, సమస్యలను వివరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలోఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్య క్షుడు బసవ లక్ష్మీ నరసయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, కార్పొరేటర్లు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement