Sunday, May 19, 2024

NZB: మొబైల్ షాప్ లో అగ్నిప్రమాదం…లక్షల్లో ఆస్తి నష్టం..

నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 9(ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైటెక్ మొబైల్ షాప్ లో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద గల హైటెక్ మొబైల్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది.

ఎప్పటిలాగే రాత్రి షాపు మూసివేసి వెళ్లాననీ… ఇవాళ ఉదయం దుకాణం పక్కన ఉన్న స్థానికులు మొబై ల్ షాప్ నుండి పొగ వస్తుందని సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన దుకాణానికి వచ్చానని బాధితుడు తెలిపారు. షార్ట్ సర్క్యూర్ తోనే ఈ అగ్ని ప్రమాదంలో సంభవించిందని, ఈ ప్రమాదంలో మొబైల్స్, కంప్యూటర్స్, సీసీ కెమెరాలు కాలిపోయాయని, లక్షల రూపాయలు నష్టపోయానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement