Monday, April 29, 2024

రైతు సంక్షేమ ప్ర‌భుత్వం బీఆర్ఎస్.. బిచ్కుంద ఏఎంసీ చైర్మన్

బాన్సువాడ, (బిచ్కుంద), ఏప్రిల్ 27 ప్రభ న్యూస్ : రైతులను అన్ని రంగాల్లో ఆదుకొని, రైతుల మేలుకోరే ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమ‌ని బిచ్కుంద ఏఎంసీ చైర్మన్ నాగనాథ్ పటేల్ అన్నారు. బిచ్కుంద మండలం మెక్కా గ్రామంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం బిచ్కుంద సొసైటీ చైర్మన్ శ్రీహరి బాలు ‌ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిచ్కుంద ఏఎంసీ చైర్మన్ నాగనాథ్ పటేల్ మాట్లాడుతూ… రైతన్న సమస్యలను జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కృషితో పరిష్కారమ‌వుతున్నాయ‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇస్తూ నేరుగా కల్లాల వద్ద సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం రైతులకు ఎంతగానో ‌సౌకర్యం లభించిందన్నారు.

గతంలో మండల కేంద్రానికి తీసుకెళ్లి దళారులకు అమ్మి ఎంతగానో నష్టపోవాల్సి వచ్చిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకుంటున్న ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు.‌ రైతుబంధు పథకం, రైతు బీమా పథకం ఇలా రైతుల పక్షాన ఉంటూ ‌రైతులను మేలుకోరే ప్రభుత్వమ‌ని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు యాదవరావు, బారాస మండల అధ్యక్షుడు వెంకటరావు దేశాయ్, బిచ్కుంద మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బసవరాజ్ పటేల్, మెక్కా సర్పంచ్ నవాజ్, సీనియర్ నాయకులు రాజు పటేల్, సొసైటీ డైరెక్టర్ గణపతి రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు ‌సలీం ఆసాద్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి సౌమ్య, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement