Wednesday, May 15, 2024

NZB: అంగరంగ వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ..

నిజామాబాద్ సిటీ, జనవరి 13 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ నగరంలో అయ్య ప్ప స్వామి మహా పడిపూజ కన్నుల పండువగా నిర్వహిం చారు. స్వామియే శరణం అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో శనివారం నగరంలోని మార్వాడి గల్లీలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ నివాస ప్రాంతమంతా మారుమోగింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కుమారులు కన్నె స్వామి ధన్ పాల్ వినయ్ కుమార్, ధన్ పాల్ ప్రణయ్ కుమార్, ఉదయ్ కుమార్ లు మణికంఠుడికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజను శనివారం వైభవంగా నిర్వహించారు. శబరిమలై సన్నిధిని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేశారు.


అష్టాదశ కలశాలతో .. అయ్యప్ప స్వామికి పంచా మృతాభిషేకం చేసి కనుల పండుగగా అయ్యప్ప మహా పడిపూజను నిర్వహిం చారు. అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామి 18 మెట్ల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి అయ్యప్ప, గణపతి, కుమార స్వామి విగ్రహలను ప్రతిష్టించి పూజలు చేశారు. ఆగమయ్య, రాజు, రత్నం గురుస్వామి భజన బృందం ఆధ్వర్యంలో స్వాములు శరణు ఘోషల మధ్య భజనలు, కీర్తనలు పాడుతూ ప్రత్యేక పడిపూజ చేశారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారు మోగింది.


అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో మహా పడిపూజలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా పెటేతులై ఆడారు. ఈ సందర్భంగా కన్నె స్వామి వినయ్ మాట్లాడుతూ మాట్లాడుతూ… అయ్యప్ప మాల ధరించడం అంటే ఎన్నో జన్మ జన్మల పుణ్యఫలం అని అన్నారు. స్వామివారి ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదన్నారు. ఇందూరులో ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మహా పడిపూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యా త్మిక భావన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం లో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement