Sunday, May 5, 2024

NZB: రైల్వేగేట్ వద్ద ఆందోళన.. స్టేషన్ మాస్టర్ కు వినతిపత్రం అందజేత

నిజామాబాద్ సిటీ, ఆగస్టు 30 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిసాన్ గంజ్ ప్రాంతంలోని స్థానిక లలితా మాల్ టాకీస్ వద్ద గల రైల్వే గేట్ అధిక సమయం మూసి ఉంచడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైల్వే పరిరక్షణ సమితి సభ్యులు, స్థానికులు, వ్యాపారులు బుధవారం రైల్వే గేట్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైల్వే పరిరక్షణ సమితి అధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ… తరచూ రైల్వే గేట్ అధిక సమయంలో మూసి ఉంచడంతో ఇక్కడ స్థానిక వ్యాపారులకు, కూలీలకు, పాదాచారులకు కాలనీ వాసుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గేటు తెరిచే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. అంతేకాకుండా కొన్ని రోజుల నుంచి అధిక సమయంలో రైల్వే గేట్ మూసి ఉంచడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు, తీవ్ర ఇబ్బందులకు గురి కావడంతో ఆందోళన చేపట్టినట్లు రైల్వే గేట్ పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు.

సుమారు ప్రతిరోజు 12 గంటల నుంచి 18 గంటల వరకు రైల్వే గేట్ మూసి ఉంచడంతో నిజామాబాద్ జిల్లా ప్రధాన కేంద్రమైన గంజ్ ప్రాంతంలోకి వచ్చే వ్యాపారులు, కూరగాయలు కొనడానికి వచ్చే గృహిణిలు, స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. గతంలో ఈ రైల్వే గేట్ మూసి ఉంచడంతో కాలనీవాసులు వ్యాపారులు అందరూ కలిసి రైల్వే గేట్ పరిరక్షణ సమితి కమిటీగా ఏర్పడి తమ సమస్యను పరిష్కరించుకున్నామని తెలిపారు. ఈ విషయమై బుధవారం రైల్వే స్టేషన్ మాస్టర్ కి కాలనీ వాసులు, పరిరక్షణ సమితి సభ్యులు అంతా కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, రైల్వే అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement