Sunday, May 5, 2024

NZB: చిన్నారి చైత్రకు అచీవర్‌ అవార్డు

నిజామాబాద్‌ సిటీ, డిసెంబర్ 30(ప్రభ న్యూస్): నగరంలోని గాయత్రి నగర్‌కు చెందిన బాస చైత్ర ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు నిర్వాహకులు చేపట్టిన కార్యక్రమంలో అతి చిన్న వయస్సు అనగా మూడు సంవత్సరాల 5నెలల్లోనే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో అచీవర్‌ అవార్డును అందుకోవడం అభినందనీయం.

చైత్రకు ఐబిఆర్‌లో స్థానం దక్కడంతో తల్లిదం డ్రులు అన్నపూర్ణ, సుశీల్‌ కుమార్‌లు హర్షం వ్యక్తం చేశారు. తమ పాప ఇప్పటి వరకు స్కూల్‌ కూడా వెల్లలేదని, ఇంట్లో ఉంటూ విషయ పరిజ్ఞానంపై పట్టు సాదించి అచీవర్‌ అవార్డును కైవసం చేసుకుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement