Monday, May 6, 2024

New Delhi – నిర్మలా సీతారామన్‌ తో హరీశ్ రావు భేటీ – బకాయిలు చెల్లించాలని వినతి

న్యూ ఢిల్లీ -కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ తో తెలంగాణ మంత్రి హరీశ్‌రావు నేడు భేటి అయ్యారు తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మూడేళ్లకు కలిపి రూ.1350 కోట్లు విడుదల కాలేదని, వెంటనే విడుదల చేయాలని వినతిపత్రం అందజేసారు.

నేడు జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్న హరీశ్‌రావు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు దాదాపు రూ.700 కోట్లు జీఎస్‌టీ సెస్‌, ఐజీఎస్‌టీ రూ.120 కోట్లు విడుదల చేయాలని కోరారు సమావేశం . అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి . ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మూడేళ్లకు కలిపి రూ.1350 కోట్లు విడుదల కాలేదని, వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు, . అనంతరం కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిసిన హరీశ్‌రావు.. నూతన కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటు, నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement