Thursday, May 16, 2024

పంచాయతీ కార్యదర్శులకు కెసిఆర్ తీపి కబురు – సర్వీస్ రెగ్యులరైజ్‌ కి ఆదేశాలు

హైదరాబాద్ – తెలంగాణలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు (జేపీఎస్‌) ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు.నాలుగేళ్ల సర్వీసు కాలాన్ని పూర్తి చేసుకున్న ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష్యాన్ని మూడింట రెండొంతులు చేరుకున్న వారిని క్రమబద్ధీకరించాలని సీఎం ఆదేశించారు

. ఈ మేరకు ప్రొబేషన్‌ పూర్తయిన కార్యదర్శుల పనితీరును అధికారులు పరిశీలించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,350 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. తమను క్రమబద్ధీకరించాలంటూ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జేపీఎస్‌లు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం జేపీఎస్‌లను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు సీఎం కేసీఆర్‌ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement