Friday, May 3, 2024

నేత్ర‌ప‌ర్వంగా యాదాద్రీశ్వ‌రుడి తిరు క‌ల్యాణం…

యాదగిరి గుట్ట – యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి బ్ర‌హ్మోత్వావాలు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి.. దీనిలో భాగంగా యాదాద్రీశ్వ‌రుడికి తీరుకల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహించారు. బాలాలయంలోని మండపంలో ఉదయం 11.06 గంటలకు స్వామి, అమ్మ వార్లను ఎదురెదురుగా కూర్చోబెట్టి కల్యాణం జ‌రిపారు. కల్యాణం సందర్భంగా స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అర్చకులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మ కర్త బి. నరసింహ మూర్తి, ప్రధానార్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు, మోహణాచార్యులు, యాజ్ఞికులు ప్రణీతా చార్యులు, పారాయణం దారులు, అర్చక బృందం తదితరులు పాల్గొన్నారు.
కాగా, భక్తుల సౌకర్యార్ధం కొండకింద రాత్రికి యాదగిరిగుట్టలోని పాత జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కల్యాణం నిర్వహిస్తారు. స్వామివారి కల్యాణం వీక్షించేందుకు ఇప్పటికే ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement