Saturday, May 4, 2024

NLG: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మహిళా మృతి

పెన్ పహాడ్, ఫిబ్రవరి 4(ప్రభన్యూస్‌): ప్రమాద వాశత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మహిళా మృతి చెందిన ఘటన మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వీరబోయిన ధనమ్మ (32) తన ఇంట్లో దండెం తీగపై ఆరవేసిన బట్టలు తీస్తుండగా తీగకు విద్యుత్ సరఫరా కావడంతో చేతికి షార్ట్ సర్క్యూట్ జరిగి ధనమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.

మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు,కుమారుడు ఉన్నారు. అప్పటివరకు పిల్లలతో గడిపిన ధనమ్మ విద్యుత్ షాక్ గురై మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లల రోధన గ్రామస్తులను కంటత‌డి పెట్టించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement