Monday, April 29, 2024

MBNR: అల్లిపూర్ అటవీ ప్రాంతంలో బ్లాస్టింగ్లు… భయాందోళలో గ్రామస్తులు…

ఉమ్మ‌డి మహబూబ్‌న‌గర్ జిల్లా బ్యూరో,(ప్రభ న్యూస్):మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లా కేంద్రానికి కూత పెట్టు దూరంలో ఉన్న అల్లిపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో బ్లాస్టింగ్లు చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారుల అండతో బ్లాస్టింగ్లు చేసి గుట్టలను పిండి రాళ్లని విక్రయిస్తున్నరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

అటవీ నిబంధనలకు తూట్లు పొడిచి రాళ్లు విక్రయించే ముఠా అల్లిపూర్ అటవీ ప్రాంతానికి యదెచ్చగా రోడ్డు వేసుకొని గుట్టల్లో పెద్ద పెద్ద రాళ్లను బ్లాస్టింగ్ చేసి రాళ్ల వ్యాపారం కొనసాగిస్తున్న అటవీ శాఖ అధికారులు కిమ్ అనకుండా కూర్చోవడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.గ్రామానికి సమీపంలోని గుట్టల్లో బ్లాస్టింగ్ చేయడం వల్ల తమ ఇళ్లకు నెర్రలు వస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టింగ్ల విషయమై పలుసార్లు అటవీ శాఖ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని వారు అంటున్నారు. ప్రతిరోజు అటవీ ప్రాంతంలో గుట్టలను బద్దలు కొట్టి రాళ్లను ట్రాక్టర్లలో తీసుకెళ్లి విక్రయిస్తున్న ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

అటవీ సంపదకు విఘాతం కలిగించే వారిపై కొరడా జూలీపించవలసిన అధికారులు ఎంత మాత్రం పట్టించుకోలేదని వారు అంటున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అల్లిపూర్ ప్రాంతంలో దర్జాగా రాళ్లను కొట్టి అటవీ సంపదను కాజేస్తున్న అధికారులు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. అంతే కాకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న అల్లిపూర్ గ్రామ పరిధిలోనీ అటవీ ప్రాంతంలో మైనింగ్ మాఫియా రాళ్ల వ్యాపారం చేస్తున్న వారిపై వారికి సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement