Tuesday, May 14, 2024

నాగార్జునసాగ‌ర్ లో జానా ఒంట‌రి పోరే….

నాగార్జున‌ సాగర్‌ ఉపపోరు రోజురోజుకు వేడెక్కు తున్నది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థు లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మండలాలు, గ్రామాల వారిగా ఇన్‌చార్జీలను నియమించ డంతో ఓటర్ల వద్దకు క్యూ కడుతున్నారు. అందులో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ముందు వరసలోనే ఉన్నది. ఇక బీజేపీ కూడా దాదాపు 30 మంది సీనియర్లను మండలాలు, గ్రామాల వారిగా ఇన్‌చార్జీలను నియమించింది. వారు ప్రచారం పర్వంలోకి దూకడమే ఆలస్యంగా ఉంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇంకా ఇన్‌చార్జీలను కూడా ప్రక టించలేదు. పార్టీ అభ్యర్థి జానారెడ్డి ఒక్కరే ఒంటరి పోరు చేస్తున్నారు. ఇద్దరు తనయు లతో పాటు నియోజక వర్గంలోని పార్టీ సీనియర్లను సమన్వయం చేసుకుంటూ నియోజక వర్గాన్ని ఇప్పటికే ఒకసారి చుట్టేశారు. నామినేషన్‌ వేయడానికి ముం దే నియోజక వర్గంలోని హలియాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ సీనియర్లు, డీసీసీ అధ్యక్షులను ఆహ్వానిం చిన విషయం తెలిసిందే. ఈ సభకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్యం ఠాగూర్‌ దూరంగా ఉన్నారు. ఇప్పటి వరకు సాగర్‌ ఉప ఎన్నికపైన కనీసం సమీక్ష కూడా చేయలేదు. దుబ్బాక ఉప ఎన్నికను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ప్రతిష్టా త్మకంగా తీసుకున్నప్పటికి కనీసం అక్కడ డిపాజిట్‌ రాకపోవడంతో పార్టీ కేడర్‌ నిరుత్సాహానికి గురైంది. అయితే సాగర్‌లో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని, పార్టీ కేడర్‌ క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్నందున సీనియర్లకు పోలింగ్‌ బూత్‌ల వారిగా ఇన్‌చార్జీలను నియమించి పూర్తి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ విజయానికి మరింత దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి మాత్రం ఇతర నాయ కులను ఇన్‌చార్జీలను నియమించుకోవడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో నియోజక వర్గం లోని పార్టీ కేడరే కష్టపడి పని చేసి గెలిపించిందని, ఇప్పుడు కూడా నియోజక వర్గంలోని నాయకులే గెలిపిస్తారనే ధీమాతో జానారెడ్డి ఉన్నారని ఆయన అనుచర వర్గం చెబుతోంది. అధికార టీఆర్‌స్‌ నుంచి వస్తున్న విమర్శలకు.. కాంగ్రెస్‌ నుంచి ధీటుగా సమాధానం ఇవ్వ డంలో కాంగ్రెస్‌ వెనుకబడుతున్నదనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్‌ హయాంలో సాగర్‌లో అభివృద్ధి శూన్యమని, టీఆర్‌ఎస్‌ హయాం లోనే అభివృద్ధి జరిగిందంటూ మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతి నిధులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఇకపోతే మహాజన సోషలిస్ట్‌ పార్టీ నుంచి కూడా అడెపు నాగార్జునను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదగ బరిలోకి దింపిన విష యం తెలిసిందే. పార్టీ అభ్యర్థి విజయం కోసం ఎంఎస్‌పీ, ఎమ్మార్పీ ఎస్‌ శ్రేణులను గ్రామాల వారిగా ఇన్‌చార్జీలను నియమించడమే కాకుండా.. మందకృష్ణ మాదిగ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
పార్టీ ముఖ్య నేతలతో రోడ్‌ షోలు
గ్రామాలు, పోలింగ్‌ బూత్‌ల వారిగా ఇన్‌చార్జీలను నియమించి ప్రచారం చేయడం కంటే.. ముఖ్య నేతలతో మండల కేంద్రాల్లో రోడ్‌ షోలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు సీనియర్లతో ప్రచారం చేయించాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement