Saturday, May 18, 2024

మహిళల స్వయం ఉపాది శిక్షణ కేంద్రాలు..

బెల్లంపల్లి : మహిళలు స్వయం ఉపాది శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రూరల్‌ సీఐ కె.జగదీష్‌ అన్నారు. మాల గురిజాల గ్రామంలో ఆత్మీయత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్‌ శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ఇంటి పట్టున ఉండి ఈ కుట్టు శిక్షణను నేర్చుకోవడం వల్ల కుటుంబానికి ఆదారం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం కుట్టు శిక్షణ నేర్చుకున్న మహిళలు ఎంతగానో రాణిస్తున్నారని, ఎంతగానో రాణిస్తున్న ఆత్మీయత ఫౌండేషన్‌ నిర్వాహకులు 70 మంది మహిళలకు ఉచిత కుట్టుశిక్షణ నేర్పించడం చాలా అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తమవంతు సహాయసహకారాలను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల గురిజాల సర్పంచ్‌ గోమాస అశోక్‌, మాజీ సర్పంచ్‌ తిరుపతి, ఆత్మీయ ఫౌండేషన్‌ అధ్యక్షుడు తిరుపతి, ప్రధాన కార్యదర్శి కోల వెంకటేష్‌, క్రీయాశీల సభ్యులు వికాస్‌ యాదవ్‌, రత్నం శ్రీనివాస్‌, పి.మనోజ్‌, జూపాక శేఖర్‌, చంద్రయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement