Monday, April 29, 2024

NLG: రుణమాఫీ అమలు… కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

మోత్కూర్, ఆగస్టు 3 (ప్రభ న్యూస్) : తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిల్చారని, రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు అందిస్తూ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా మార్చారని మోత్కూర్ ఎంపీపీ రచ్చ కల్పన లక్ష్మీ నరసింహ రెడ్డి, మార్కెట్ చైర్మన్ యాకూబ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సావిత్రి మేఘారెడ్డిలు అన్నారు. సీఎం కేసీఆర్ రూ.19వేల కోట్లతో రుణమాఫీ అమలు పట్ల ప్రకటన చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి బీఆర్ఎస్ శ్రేణులు వందలాది మంది రైతులతో కలిసి పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయం దండగలా మారగా… స్వరాష్ట్ర తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు రైతుల కోసం ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. దేశంలోనే సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నెంబర్ వన్ స్థానంలో నిల్చారన్నారు.

తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో రైతులు సీఎం కేసీఆర్ కి నీరాజనాలు పడుతున్నారని, తమ రాష్ట్రాల్లో సైతం తెలంగాణ రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కేసీఆర్ ని కోరుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 15 లోపు 45 రోజుల్లో రూ.19వేల కోట్ల రుణమాఫీ అమలు చేసి రైతుల కష్టాలను తీర్చనున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో రైతులు రైతు సంక్షేమానికి కట్టుబడిన సీఎం కేసీఆర్ ను… హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, మున్సిపల్ అధ్యక్షుడు పొన్నబోయిన రమేష్, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, సింగల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ మెగారెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షులు కొండ సోoమల్లు, వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు నాగయ్య, మాజీ ఎంపీటీసీలు జంగ శ్రీను, పానుగుల్ల విష్ణు, జిల్లా నాయకులు చింతల విజయభాస్కర్ రెడ్డి, మర్రి అనిల్ కుమార్, లెంకల వేణు, బత్తిని హనుమంతు, రఘుపతి, పురుగుల మల్లయ్య, దండ్ల కళ్యాణ్, మొరిగాల వెంకన్న, కొక బిక్షం, విద్యాసాగర్, మహిళా విభాగం మండల, పట్టణ అధ్యక్షురాలు మల్లం అనిత, కట్ట ఇంద్ర జ్యోతి, దబ్బేటి శైలజ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement