Sunday, May 5, 2024

నాగార్జున సాగ‌ర్ కు భారీగా వ‌ర‌ద‌.. 5 గేట్లు ఎత్తివేత

రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాలతో ప్రాజెక్టుల‌కు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్కు కూడా వరద పెరిగింది. దీంతో ప్రాజెక్ట్‎లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1,22,131 క్యూ సెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 1,30,858 క్యూ సెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589 అడుగులుగా ఉంది. జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement