Wednesday, May 15, 2024

TS: కాంగ్రెస్ ను వీడి గులాబీ గూటికి.. ఆహ్వానించిన ఎమ్మెల్యే దాసరి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పెద్దపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరారు. ఇవాళ పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ…. ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. గత పాలకుల హయాంలో పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, గత తొమ్మిదేళ్లలో 40ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపామన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, దళిత బంధు, బీసీ బంధు లాంటి ఎన్నో పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీల మాయమాటలు నమ్మే పరిస్థితిలో పెద్దపల్లి ప్రజలు లేరని, రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అడ్డూరి సమ్మయ్య, పొట్ల లస్మయ్య, పొట్ల సాగర్, కర్రి మల్లేష్, కర్రి రమేష్, లసెట్టి రాజమల్లు, దొమ్మటి కుమార్, అంకటి తిరుపతి, తిప్ప శ్రీనివాస్, తిప్ప రాజయ్య, పురెల్ల కిష్టయ్య, దొమ్మటి మహేందర్, అంకతి రాజగట్టు, దొమ్మటి రాంచందర్, గడ్డం రఘుపతి, గడ్డం రమేష్ లు భారత రాష్ట్ర సమితి లో చేరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొమ్మటి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆదే చంద్రయ్య, యూత్ అధ్యక్షుడు తిప్పని శ్రావణ్, కో ఆప్షన్ బోడకుంట పోచాలు, కారుకూరి సుధాకర్, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement