Wednesday, October 9, 2024

కాళ్లు పట్టుకునేందుకే ఢిల్లీకి లోకేష్ – మంత్రి జోగి రమేష్

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరోఢిల్లీలో పెద్దల కాళ్లు పట్టుకునేందుకే లోకేష్ ఢిల్లీ వెళ్లారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. 2017 లో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సమయంలో పోలీసులు నమోదు చేసిన కేసు కు సంబంధించి ఆయన శుక్రవారం నందిగామ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ లో కాళ్ళు , పట్టుకునేందుకు లోకేష్ ఢిల్లీ పర్యటన అంటూ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లో లోకేష్ కు ఎంటి పని అని ప్రశ్నించారు. కోట్లు ఖర్చు పెట్టి, స్పెషల్ ప్లైట్ ఏర్పాటు చేసి లాయర్ ను తీసుకుని వచ్చారు వాదించుకోండి అన్నారు. టీడీపీ, జనసేన వాళ్ళ బంధం ఫెవికాల్ లాగా అతుక్కుని ఉన్నారని వ్యంగ్యాసురాలు సంధించారు.

. జనసేన టీడీపీ 2014 నుంచే కలిసి ఉన్నారనీ చెప్పారు. విడిగా వస్తారని వైసిపి ఎప్పుడూ భావించలేదన్నరు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం అని దేమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ను అవినీతి రాష్ట్రం గా మార్చాడన్నరు. సూటి కేసు కంపెనీలు పెట్టి హవాలా రూపంలో వేలకోట్ల రూపాయలు దొడ్డిదారిన తరలిస్తాడని చంద్రబాబు మేధావి అన్పవారే ముక్కుమీద వేలు వేసేలా చేసామన్నారు.చంద్రబాబు కు తగిన శాస్తి జరిగింది ప్రజలు అనుకుంటున్నారన్నరు.జగన్ మోహన్ రెడ్డి 4 ఏళ్ళ పరిపాలనలో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు వల్ల ఏం లబ్ధి జరిగిందో చెప్పాలనీ డిమాండ్ చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement