Saturday, May 4, 2024

మైనర్ యువ‌తి కిడ్నాప్ … నిందితుడు అరెస్ట్

శంకర్ పల్లి (ప్రభ న్యూస్) రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మొకిల పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ అమ్మాయి కిడ్నాప్‌ కలకలం రేపింది. స్థానికులు పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి మోకీల గ్రామంలో రాజస్తాన్ కు చెందిన 17 ఏళ్ల మైనర్ అమ్మాయి తన తల్లితండ్రుల తో నివాసం ఉంటున్నది అదే గ్రామంలో ఇంటి ఎదురుగా నివాసముంటున్న 25 ఏళ్ల యువకుడు ఆసిఫ్( డ్రైవర్) ముందుగా వేసుకున్న పతకం ప్రకారం యువతితో పరిచయం పెంచుకొని ప్రేమిస్తున్నానంటూ వెంబడిపడ్డాడు,

కొన్ని నెలలుగా వెంట బడుతున్న యువతి పట్టించుకోక పోవడంతో, ఆసీఫ్ ఆమెను కిడ్నాప్ చేసాడని, మైనర్ అమ్మాయి తల్లిదండ్రులు మోకిల పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లితండ్రులు మోకీల పోలీసు స్టేషన్ లో చేసిన ఫిర్యాదు మేరకు ఆసిఫ్ ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న మోకీల పోలీసులు ఫోక్సో చట్టం తో పాటు 417,420,363,376 పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి ఆసిఫ్ ను రిమాండ్ కు పంపారు. మొకిల పోలీసులు కేసును వేగంగా చేదించి రిమాండ్ కు పంపడంతో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది

Advertisement

తాజా వార్తలు

Advertisement