Saturday, April 13, 2024

మూడు వేల‌ క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత.. లారీ సీజ్

సంగారెడ్డి, ఆగస్టు 19 (ప్రభ న్యూస్) చేర్యాల క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ హైదరాబాద్ నుండి జోగిపేట వైపు వెళ్తున్న ఒక రాజస్థాన్ కు చెందిన లారీలో పిడిఎస్ రైస్ ను పోలీసులు ప‌ట్టుకున్నారు..లారీలో త‌రలిస్తున్న‌ది సంబంధిత అధికారులు నిర్ధారించ‌డంతో లారీని సీజ్ చేశారు.. అలాగే హ‌ర్యానా కు చెందిన లారీ డ్రైవర్ మోబిన్, క్లీనర్ సాజీద్ ల‌ను అరెస్ట్ చేశారు.. లారీలో మూడు వేల క్వింటాళ్ల రైస్ ను అక్ర‌మంగా త‌రలిస్తున్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు..

నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్స్, 4 వేల రూపాయల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సంగారెడ్డి డి.ఎస్.పి జె. రమేష్ కుమార్ పర్యవేక్షణలో, సంగారెడ్డి రూరల్ సీఐ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో ఇంద్రకరణ్ ఎస్సై మహేశ్వర్ రెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement