Tuesday, May 14, 2024

మద్యం దుకాణాల దరఖాస్తుల కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్

మహబూబ్ నగర్,ఆగస్ట్ 8 (ప్రభ న్యూస్): మద్యం దుకాణాలకు టెండర్ల దరఖాస్తులలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. గౌడ కోటాలో మహబూబ్ నగర్ లోని 3, 5, 15 షాపులకు దరఖాస్తు సమర్పించేందుకు వచ్చిన శివలీల స్వయంగా మంత్రికి దరఖాస్తును సమర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా కుల వృత్తి మేము చేసుకుందామని మద్యం దుకాణానికి దరఖాస్తు సమర్పించేందుకు వచ్చామని, ప్రభుత్వం గౌడ కులస్తులకు మద్యం దుకాణాలను గౌడ కులస్తులకు కేటాయించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో గౌడ కులస్తులకు కోటాను మరింత పెంచాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.ఇందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్ని కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని, ప్రత్యేకించి మద్యం దుకాణాలను గౌడ కుల వృత్తి అయిన మద్యం అమ్మకాలు చేసుకునేందుకు మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ కులస్తులకు భాగస్వామ్యం కల్పించడం జరిగిందన్నారు.

స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీ కుల వృత్తి మీరే చేసుకోవాలని అన్న ఉద్దేశంతోనే మద్యం దుకాణాలు కేటాయించారని తెలిపారు. భవిష్యత్తులో గౌడ కులస్తులకు మద్యం దుకాణాల కోటాను మరింత పెంచుతామని తెలిపారని, భవిష్యత్తులో మద్యం దుకాణాల కేటాయింపులు గౌడన్నలకు పెరుగుతాయని తెలిపారు. దేశంలో కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని మంత్రి తెలిపారు.కాగా మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణలో భాగంగా ఇప్పటివరకు మహబూబ్ నగర్ జిల్లాలో 23 దరఖాస్తులు రాగా ఈనెల 18 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement